Home > తెలంగాణ > రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 100 ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్‌లు

రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 100 ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్‌లు

మహిళలకు అందే 8 ర‌కాల సేవ‌లివే...

రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్.. కొత్తగా మరో 100 ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్‌లు
X

రాష్ట్ర మహిళలకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలను మరో 100 వ‌ర‌కు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 12 నుంచి అదనపు(మరో 100) కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 272 ఆరోగ్య మ‌హిళా కేంద్రాలు ఉండగా, కొత్తవాటితో ఆ సంఖ్య‌ 372కు పెరగనుంది. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది ఉంటూ, 8 రకాల ప్రధాన వైద్య సేవల‌ను ఆరోగ్య మ‌హిళా క్లినిక్స్ అందిస్తున్నాయి. ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఆరోగ్య మ‌హిళా కేంద్రాల‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆరోగ్య మహిళ’ ద్వారా ఇప్పటివరకు 2,78,317 మందికి స్క్రీనింగ్‌ నిర్వహించి, అవసరమున్న 13673 వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.





ప్రభుత్వం అందించే 8 రకాల వైద్యసేవలు ఇవే...

  • డయాబెటిస్‌, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు నిర్వహిస్తారు.
  • అలాగే, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు కూడా చేస్తారు.
  • థైరాయిడ్ టెస్ట్‌ కూడా చేస్తున్నారు. సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి వాటిని తగిన మందులను అందజేస్తున్నారు.
  • అయోడిన్ లోపం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో బాధపడుతున్న వారికి తగిన మందులు అందజేస్తున్నారు.
  • విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు కూడా చేస్తున్నారు. తగిన మెడిసిన్‌ కూడా అక్కడ అందజేస్తున్నారు.
  • మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు సంబంధిచిన టెస్టులు, చికిత్స కూడా ఇక్కడే అందుబాటులో ఉంటుంది.
  • నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు.
  • సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
  • బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు

Updated : 8 Sept 2023 7:30 AM IST
Tags:    
Next Story
Share it
Top