Home > తెలంగాణ > ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆర్టీసీకి పూర్వ వైభవం

ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆర్టీసీకి పూర్వ వైభవం

ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆర్టీసీకి పూర్వ వైభవం
X

ఆర్టీసీ ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మరో 200 కొత్త బస్సులను ప్రరంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వీర్యమైన టీఎస్ఆర్టీసీకి మహాలక్ష్మీ పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చామని ఈ సందర్భంగా వివరించారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. సోమవారం జహీరాబాద్ పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలిపోయిందని విమర్శించారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని పొన్నం స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ బీఆర్ఎస్, బీజేపీల రాజకీయ ఎత్తుగడేనని ఆయన ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Updated : 25 March 2024 7:41 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top