Home > తెలంగాణ > మల్లారెడ్డి నామినేషన్ తిరస్కరించాలని పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

మల్లారెడ్డి నామినేషన్ తిరస్కరించాలని పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

మల్లారెడ్డి నామినేషన్ తిరస్కరించాలని పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
X

మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ అంజిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తప్పులున్న విషయాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన పిటిషన్లో ప్రస్తావించారు. ఈ క్రమంలో మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

అంజిరెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని ఎన్నికల అధికారిని ఆదేశించింది. దీంతో అఫిడవిట్ లో అభ్యంతరాలపై ఫిర్యాదుదారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్లు ఈసీ తరఫు న్యాయవాదికి కోర్టుకు విన్నవించారు. దీంతో హైకోర్టు నామినేషన్ తిరస్కరించాలన్న పిటిషన్ కొట్టివేసింది.


Updated : 18 Nov 2023 4:18 PM IST
Tags:    
Next Story
Share it
Top