BRS MLA సునీతకు హైకోర్టు షాక్.. రూ.10 వేల జరిమానా
X
"ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది." 2018 ఎన్నికల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారనే ఆరోపణలపై హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనందుకు ఆమెకు హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. (MLA Gongidi Sunitha fined) అక్టోబర్ 3లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.
2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే పిటిషన్ లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి అనే వ్యక్తి కూడా ఇంప్లీడ్ అయ్యారు. తప్పుడు సమాచారం అందించినందుకు ఆమె ఎన్నికల చెల్లదని, అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సునీతను ఆదేశించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.