Home > తెలంగాణ > కేసీఆర్ ప్రభుత్వ తీరుపై హైకోర్టులో సీతక్క పిటిషన్

కేసీఆర్ ప్రభుత్వ తీరుపై హైకోర్టులో సీతక్క పిటిషన్

కేసీఆర్ ప్రభుత్వ తీరుపై హైకోర్టులో సీతక్క పిటిషన్
X

కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ వేశారు. నిధుల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అందులో పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్‌ నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నందున తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని.. సీడీఎఫ్‌ నిధుల మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్ధమంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

జిల్లా మంత్రి ఆమోదంతో నిధులు మంజూరు చేయాలన్న జీవో 12ను కొట్టేయాలని హైకోర్టుకు సీతక్క విజ్ఞప్తి చేశారు. వెంటనే నిధులు మంజూరు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. సీతక్క పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది.

Updated : 29 Sept 2023 4:02 PM IST
Tags:    
Next Story
Share it
Top