హుసేన్ సాగర్లో ఆ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు..
X
హైదారాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్ చెరువులో వినాయకుని నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్పష్టతనిచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేసిన గణపక్య విగ్రహాలను హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ విగ్రహాలకు సంబంధించి తాము గత ఏడాది జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులనే ఈ ఏడాది కూడా పాటించాలని చెప్పింది.
పర్యావరణ కాలుష్యం కారణతో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధించడం తెలిసిందే. వాటిని ప్రకృతికి హాని కలగని రీరితో కృత్రిమ ట్యాంకర్లు ఏర్పాటు చేసి అందులో విడిచిపెట్టాలని సూచిందింది. ఆ ప్రక్రియ వ్యయప్రయాసలతో కూడుకున్నదని, తాము చేసే విగ్రహాలకు డిమాండ్ తగ్గుతుందని పీఓపీ విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన పీసీబీ నిబంధనలను రద్దు చేయాలని కోరారు. నిషేధం ఉన్నప్పటికీ గత ఏడాది ఆ విగ్రహాను హుసేన్ సాగర్లో నిమజ్జనం చేశారని తెలిపారు. కోర్టు దీనిపై స్పందిస్తూ తగిన ఆధారాల కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతూ సెప్టెంబర్ 25కి విచారణను వాయిదా వేసింది.