ఇంటర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించండి : హైకోర్టు
X
ఇంటర్ కాలేజీల్లో అతిథి అధ్యాపకులు(గెస్ట్ ఫ్యాకల్టీ) కొనసాగింపుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతిథి అధ్యాపకులను కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గత విద్యా సంవత్సరాల్లో నియమితులైన అతిథి అధ్యాపకుల్లో ఫిర్యాదులు లేని, అర్హులైన వారిని ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని వెల్లడించింది.
జూనియర్ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి ఈనెల 18వ తేదీన ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయగా..దీనిపై అతిథి అధ్యాపకులు న్యాయ పోరాటానికి దిగారు. తాజా నియామకాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు... గెస్ట్ ఫ్యాకల్టీని ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఇంటర్ కమిషనరేట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 21కి వాయిదా వేసింది.