Home > తెలంగాణ > గ్రూప్ - 1 వాయిదా వేయాలన్న పిటిషన్పై విచారణ వాయిదా

గ్రూప్ - 1 వాయిదా వేయాలన్న పిటిషన్పై విచారణ వాయిదా

గ్రూప్ - 1 వాయిదా వేయాలన్న పిటిషన్పై విచారణ వాయిదా
X

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. పరీక్షల నిర్వాహణ బాధ్యతను థర్డ్ పార్టీకి అప్పగించేలా ఆదేశించాలన్న పిటిషన్ పై జస్టిస్ కాజా శరత్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు.

హైకోర్టులో 3 పిటిషన్లు

గ్రూప్ - 1 పరీక్ష వాయిదా వేయాంటూ హైకోర్టులో అశోక్ కుమార్, టి.రమేష్, జె. సుధాకర్లు వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలయ్యాయి. క్వశ్చన్ పేపర్ లీకేజీకి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యేంత వరకు గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థించారు. లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్పీఎస్పీకే పరీక్ష నిర్వాహణ బాధ్యతలు నిర్వహించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వాహణ బాధ్యతను థర్డ్ పార్టీకి అప్పగించేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.

థర్డ్ పార్టీకి ఇవ్వండి

పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన న్యాయవాదులు .. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర ఉందని, పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగించాలని కోరారు. ఓవైపు దర్యాప్తు జరుగుతోందని, నిందితుల వివరాలు పూర్తిగా బహిర్గతం కాలేదని, అయినా పరీక్ష నిర్వహణకు కమిషన్‌ సిద్ధపడుతోందన్నారు. 5 లక్షల మంది అభ్యర్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని కోరారు.

కొత్త అధికారులను నియమించాం

కమిషన్‌ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపించారు. లీకేజీ కేసులో కమిషన్లో పనిచేస్తున్న 49 మంది ఉద్యోగుల ప్రమేయం లేదని, కేవలం ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మాత్రమే ఉన్నారని అన్నారు. ఆ నలుగురిని సస్పెండ్‌ చేశామని, వారి స్థానంలో కొత్త అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనానికి విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది.

క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. జూన్ 11న తిరిగి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Updated : 2 Jun 2023 7:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top