Home > తెలంగాణ > Big Breaking.. ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు

Big Breaking.. ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు

Big Breaking.. ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు
X

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పునిచ్చింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని తెలిపింది. ఆఫిడవిట్ లో ఆస్తులు, కేసులపై తప్పుడు సమాచారం ఇచ్చారని ధర్మాసనం తేల్చింది. ఈ విషయంపైనే సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్ కోర్టును ఆశ్రయించగా .. ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేగా వనమా అనర్హుడని చెబుతూ.. డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావే ఎమ్మెల్యే అని ప్రకటించింది.

ఎన్నికలవేళ తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినందుకు గాను ధర్మాసనం వనమాకు రూ.5లక్షలు జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వనమా..ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసిన జలగం వెంకట్రావు.. వనమా అఫిడవిట్‌పై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జలగం వెంకట్రావు పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని.. తీర్పునిచ్చింది.

వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేకు అనర్హుడని.. 2018 నుంచి సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు ఎమ్మెల్యే అని తెలంగాణ ధర్మాసనం తెలిపింది. కాగా.. వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా.. బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.

Updated : 25 July 2023 12:20 PM IST
Tags:    
Next Story
Share it
Top