R. S. Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నం కేసు.. హైకోర్టు కీలక ఆదేశం
X
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై నమోదైన హత్యాయత్నం, దోపిడీ కేసుపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. కాగజ్ నగర్‌లో ప్రవీణ్ కుమార్, ఆయన కొడుకు పునీత్ తమపై దాడి చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టడం తెలిసిందే. కేసు కొట్టేయాలని ప్రవీణ్ కుమార్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు కోర్టు తాము తదుపరి నిర్ణయం తీసుకునేవరకు ఇచ్చేవరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది.
కాగజ్ నగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన బీఎస్పీ సభ స్థలం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. సభను అడ్డుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నించిందని ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మద్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రౌడీయిజం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండడంతో తెలిసిందే.