Home > తెలంగాణ > కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్‌లోకి ... వనమా నెక్స్ట్ స్టెప్?

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్‌లోకి ... వనమా నెక్స్ట్ స్టెప్?

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్‌లోకి ... వనమా నెక్స్ట్ స్టెప్?
X

2018 ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యే పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ.. వనమా వెంకటేశ్వరరావుపై ఓడిపోయిన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని, డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణిస్తూ హైకోర్టు డిక్లేర్ చేసింది.

గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా వనమా గెలవగా.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. అయితే వనమా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించారంటూ గతంలో జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్నేళ్లుగా వెంకట్రావు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. వనమాను అనర్హతుడిగా ప్రకటిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ ప్రకటించినందుకు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీకోర్టుకు వెళతారని బయట టాక్ నడుస్తోంది.

అయితే ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసిందంటున్నారు కొందరు. కారణం.. నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావుకు పెద్ద పాజిటివ్ టాక్ ఏం లేకపోగా.. ఆయన కొడుకు రాఘవేంద్రరావు అలియాస్ రాఘవ చేసిన నిర్వాకం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి యొక్క కుటుంబం(అతని భార్యని వేధించి) ఆత్మహత్యకు కారణమైన అతడిపై పోలీసులు ఏ2 నిందితుడిగా కేసు నమోదు చేశారు కూడా. పరారీలో ఉన్న తన కొడుకుని పోలీసులకు అప్పగిస్తానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన తన కొడుకును వెనకేసుకొచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కావాల్సిన తన కొడుకును కొందరు కుట్రలు పన్నారని, రాజకీయ భవిష్యత్‌ను ఆగం చేశారని మాట్లాడారు.

ఆ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం.. వనమా రాఘవపై వచ్చిన ఆరోపణలతో అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే వనమాను ఎలా వదిలించకోవాలని తర్జనభర్జన పడుతున్న పార్టీకి... హైకోర్టు తీర్పు ఓ రకంగా గుడ్ న్యూస్ చెప్పిందంటున్నారు బయటి జనాలు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీలో ముందు నుంచి ఉన్న జలగం వెంకట్రావ్ కే టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు.





Updated : 25 July 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top