Home > తెలంగాణ > అధికారిక వెబ్‌సైట్ నుంచి తెలంగాణ చరిత్ర పేజీ తొలిగింపు!

అధికారిక వెబ్‌సైట్ నుంచి తెలంగాణ చరిత్ర పేజీ తొలిగింపు!

అధికారిక వెబ్‌సైట్ నుంచి తెలంగాణ చరిత్ర పేజీ తొలిగింపు!
X

అధికారిక వెబ్ సైట్ నుంచి తెలంగాణ చరిత్ర పేజీ తొలిగించి కాంగ్రెస్ తెలంగాణ చరిత్ర తిరగరాయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత శాసన సభ సమావేశాల్లో తెలంగాణ నుండి కేసీఆర్ అనావాళ్లు లేకుండా తొలిగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా సీఎమ్‌వోకు సంబంధించిన యూట్యూబ్ చానెల్లలో గత ప్రభుత్వానికి సంబంధించిన వీడియోలను కూడా సర్కార్ తొలగించింది.

ఇదిలా ఉండగా గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో పలు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. అధికారి వెబ్ సైట్ లో తెలంగాణ చరిత్రను మర్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తుందా.. లేక, తమకు అనుకూలంగా చరిత్రను తిరిగి రాసుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనిపై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ అధికారిక చిహ్నం మారుస్తామని ప్రకటించిన సీఎం.. వాహన రిజిస్ట్రేషన్ అక్షరాలు టీఎస్ నుండి టీజీ గా మార్చిన విషయం తెలిసిందే.

Updated : 20 March 2024 10:36 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top