Mahmood Ali: గన్‌మెన్‌ను కొట్టడంపై హోంమంత్రి మహమూద్ అలీ ఏమన్నారంటే..?
X
హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్‌పై చేయిచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి తీరు కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో గన్‌మెన్‌పై చేయిచేసుకోవడంపై మహమూద్ అలీ స్పందించారు. ప్రేమతో మాత్రమే కొట్టానని.. కొట్టాలనే ఉద్ధేశం తనకు లేదన్నారు. రేయి పగలు తన్ను కంటికి రెప్పలా భద్రత కల్పిస్తున్న గన్‌మెన్ తన కుమారుడు లాంటి వాడని.. ఆ ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పారు. ఎంత చిన్నవారికైనా గౌరవం ఇస్తానని చెప్పిన మహమూద్ అలీ.. తనతో ఉన్నవారిని తన బిడ్డల్లా చూసుకుంటానని స్పష్టం చేశారు.
కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకు విషెస్ చెప్పారు. అయితే పూల బొకే విషయంలో మహమూద్‌అలీ.. తన గన్‌మెన్ చెంపై కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. గన్ మెన్ ను కొట్టిన హోంమంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. నెటిజన్లు సైతం హోంమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.