తెలంగాణ నెక్స్ట్ సీఎం నేనే ..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
తెలంగాణ నెక్స్ట్ సీఎం తానేనని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి ఛాలెంజ్ చేశారు. '2028లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు నేనే ముఖ్యమంత్రి అవుతా. విడిచిపెట్టేదే లేదు. ఇది నా ఛాలెంజ్' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో ఒక సీఎంను (కేసీఆర్), మరో సీఎం అభ్యర్థిని (రేవంత్) రమణారెడ్డి ఓడగొట్టారు.మరోవైపు బీజేపీ నేతల ఛాలెంజ్‌లు ఆసక్తిని అంతకంతకు పెంచుతున్నాయి.
కాగా.. ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కూమార్.. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ విసిరి.. తీవ్ర చర్చకు తెరలేపారు. కాగా.. ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఛాలెంజ్.. ఇప్పుడు సర్వత్రా చర్యనీయాంశంగా మారింది.ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేసి మరీ.. ఒక సీఎంను, ఒక సీఎం అభ్యర్థిని ఓడగొట్టిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి.. ఇప్పుడు మరో సంచలన సవాల్ విసిరారు.