Home > తెలంగాణ > తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన మరో సంస్థ

తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన మరో సంస్థ

తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన మరో సంస్థ
X

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టబడులను పెట్టడానికి అంతర్జాతీయ స్థాయి సంస్ధ రెన్యూ సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రూ.6 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి ఈ దిగ్గజ సంస్ధ రాష్ట సర్కారుతో నేడు ఒప్పందం కుదుర్చకుంది. మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఐటీ శాఖ కార్యదర్మి జయేశ్ రంజన్ ఒప్పందం పై సంతకాలు చేశారు. ఈ ఇండస్ట్రీ ఏర్పాటుతో హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్‌గా మారుతుందని తెలిపారు.

కర్నాటక, మహారాష్ట్రలో ఆ సంస్థకు తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ అతిపెద్ద తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పాలని ఆ సంస్థ నిర్ణయం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తుందని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్శించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తున్నామని ప్రకటించారు. ఈ పరిశ్రమ వల్ల రానున్న మూడేళ్లలో దాదాపు 400 మందికి ఉపాధి లభిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు కోర్ రంగాలుగా ఉన్నాయని, ఈ రంగాల్లో అనేక ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయని ఆయనపేర్కొన్నారు.

Updated : 19 Feb 2024 9:13 PM IST
Tags:    
Next Story
Share it
Top