Home > తెలంగాణ > కిసాన్ అజెండాతో భయం మొదలైంది..మోదీకీ మంత్రి హరీష్ కౌంటర్

కిసాన్ అజెండాతో భయం మొదలైంది..మోదీకీ మంత్రి హరీష్ కౌంటర్

కిసాన్ అజెండాతో భయం మొదలైంది..మోదీకీ మంత్రి హరీష్ కౌంటర్
X

వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో అవార్డులిచ్చి..గల్లీలో తిడతారా అంటూ మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలైన మిషన్ భగీరథ, రైతు బంధును కాపీ కొట్టిందని అన్నారు. కేసీఆర్ కిసాన్ అజెండాతో కేంద్రంలో భయం మొదలైందిని అన్నారు. అందుకే ఫైనాన్స్ కమిషన్ చెప్పినా రూపాయి కూడా ఇవ్వడంలేదని హరీష్ రావు దుయ్యబట్టారు.

"తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది. గిరిజన యూనివర్సిటీ , బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమయ్యాయి. బీజేపీ మోసాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి..వ్యాగన్ ఫ్యాక్టరీ ఇస్తారా..?ED,CBIలను అడ్డం పెట్టుకొని కక్ష సాధిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటే అది కేసీఆర్ పనితనం కారణంగానే. ఎందుకంటే కేసీఆర్ పరిశ్రమలకు నీరు, కరెంటు, భూమి ఇచ్చారు. ఇండస్ట్రియల్ పాలసీలను తీసుకువచ్చారు, కాబట్టే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువగా వస్తున్నాయి. ఇందులో మోదీ గొప్పతనం ఏమీ లేదు"అని మంత్రి తెలిపారు.

విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఇలా కుంటుంబ పాలనలో కూరుకుపోతుందని తాను ఏనాడు అనుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతిని పెంచిపోషిస్తోందని, కోట్లాది రూపాయలను కొల్లగొడుతోందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి ప్రజలకు తెలియడంతో.. వాళ్ల దృష్టిని మళ్లించేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోందని విమర్శించారు. కేసీఆర్ వ్యూహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్ కుంటుంబ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని, త్వరలోనే వాళ్ల పని పడుతుందని వెల్లడించారు‘రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగు పనులు మాత్రమే చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను తిట్టడం, కుటుంబం.. పార్టీని పోషించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేయడం. ఇక్కడ అవినీతి ఆరోపణలు లేని ఒక్క ప్రాజెక్టూ లేదని కేసీఆర్ సర్కార్ పై మోదీ విరుచుకుపడ్డారు.




Updated : 8 July 2023 2:06 PM IST
Tags:    
Next Story
Share it
Top