మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్..మధ్యంతర పిటిషన్ కొట్టివేత
X
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత తెలంగాణ రాష్ట్ర మినిస్టర్ కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. మంత్రి వేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది.
తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ మంత్రి హై కోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. దాదాపు 3 ఏళ్లపాటు జరిగిన విచారణలో వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తుది వాదనల కోసం కేసును బుధవారానికి వాయిదా వేసింది.
2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసిన కొప్పుల ఈశ్వర్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆయనపై పోటీగా కాంగ్రెస్ టికెట్‌తో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల బరిలో దిగారు. అయితే అక్రమ పద్ధతుల్లో కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో గెలిచారని.. ఆయన ఎన్నిక చెల్లదంటూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2018లో హైకోర్టులో పిటిషన్ చేశారు. ఆయన్ను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో లక్ష్మణ్ పిటిషన్‌ను కొట్టేయాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 3 ఏళ్ల విచారణ అనంతరం తాజాగా హైకోర్టు మంత్రి పిటిషన్ ను కొట్టేసింది. తుది విచారణను రేపటికి వాయిదా వేసింది.