Home > తెలంగాణ > తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ బర్త్ డే.

తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ బర్త్ డే.

పుట్టినరోజు కానుకగా పేదవిద్యార్ధులకు చదువు

తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ బర్త్ డే.
X


తెలంగాణ రాజకీయాల్లో తనదైన మార్క్ చూపించిన డైనమిక్ లీడర్ కేటీఆర్. పదేళ్ళ క్రితం వరకు కేసీఆర్ కొడుకుగానే అందరికీ తెలిసిన ఈ యంగ్ బాస్....తెలంగాణ ఉద్యమం నుంచి తన మార్క్ ను చూపించడం మొదలుపెట్టారు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి మినిస్టర్ గా ఎదిగి....హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధికి దారులు వేస్తున్న కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు ఈరోజు.

కేటీఆర్ ఈరోజు తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సాధారణంగా ఎవరిదైనా బర్త్ డే అయితే వాళ్ళకి మనం గిఫ్ట్ లు ఇస్తాం. కానీ ఈ పుట్టినరోజుకు కేటీఆరే స్వయంగా బహుమతులు ఇస్తున్నారు. ఈరోజు పేదవిద్యార్ధులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. 10, 12వ తరగతి విద్యార్థులకు రెండేళ్ళపాటు ల్యాప్‌టాప్, కోచింగ్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ లో అనౌన్స్ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోమ్‌లోని అనాథలను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆయన 47 పుట్టినరోజు....అందుకు తగ్గట్టుగా టెన్త్, ఇంటర్ మీడియెట్ లో ప్రతిభ కనబరిచిన 47 మంది విద్యార్ధులకు, ప్రొఫెషనల్ కోర్సులకు చెందిన మరో 47 మంది స్టూడెంట్స్ కు చదువుకునేందుకు సహాయం చేస్తానని చెప్పారు. వాళ్ళు జాబ్స్ తెచ్చుకుని స్థిరపడేంతవరకు ఆర్ధిక, వ్యక్తిగత సాయాలు అందిస్తానని మాట ఇచ్చారు. ఈ విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ట్విట్టర్ లో తెలిపారు.

మరోవైపు కేటీఆర్ పుట్టినరోజును బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. నిన్నటి నుంచే వేడుకలతో హడావుడి చేస్తున్నారు.


Updated : 24 July 2023 9:29 AM IST
Tags:    
Next Story
Share it
Top