Home > తెలంగాణ > గవర్నర్కు మోదీ ఒక మాట చెప్తే బాగుండేది : కేటీఆర్

గవర్నర్కు మోదీ ఒక మాట చెప్తే బాగుండేది : కేటీఆర్

గవర్నర్కు మోదీ ఒక మాట చెప్తే బాగుండేది : కేటీఆర్
X

ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను అవమానించారని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్లో జరిగిన విజయ సంకల్ప సభా వేదికగా సీఎం కేసీఆర్పై మోదీ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. గుజరాత్కు 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తీసుకపోయిన ప్రధాని.. రూ. 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు. తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా మోదీ ప్రజలకు చెప్తే బాగుండేదని మండిపడ్డారు.

‘‘మోదీ దేశ చరిత్రలోకే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని. కేంద్రం పరిధిలో 16 లక్షల ఖాళీలను మోదీ ఇంత వరకు భర్తీ చేయలేదు. తెలంగాణలో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన మాపై విమర్శలు చేస్తున్నారు. బిల్లులను ఆమోదించకుండా వర్సిటీల్లో ఖాళీల భర్తీని గవర్నర్‌ అడ్డుకుంటున్నారు. బిల్లులను అడ్డుకుంటున్న గవర్నర్‌కు ప్రధాని మోదీ ఒక మాట చెబితే బాగుండేది ’’ అని కేటీఆర్ అన్నారు.

ఆదివాసీ బిడ్డలపై ప్రధాని కపట ప్రేమ చూపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల సంక్షేమం గుర్తించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు.. గిరిజన వర్సిటీపై మోడీ స్పష్టతను ఇవ్వాలన్నారు. ములుగులో ఆరేళ్ల క్రితం 350 ఎకరాలు సేకరించి ఇచ్చాం.. గిరిజన వర్సిటీకి నిధులు ఇవ్వడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

15 వేల మంది స్థానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు. నల్ల చట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న ప్రధాని వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమగ్ర వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్ర ఏజెన్సీలను చూపించి ప్రధాని చేసిన హెచ్చరికలకు తాము భయపడమని.. తెలంగాణకు వచ్చి అసత్యాలు మాట్లాడడం మోదీకి అలవాటుగా మారిందని కేటీఆర్‌ విమర్శించారు.

Updated : 8 July 2023 4:39 PM IST
Tags:    
Next Story
Share it
Top