Home > తెలంగాణ > Preeti Reddy : నా గదిలోకి చొరబడి బెదిరించారు.. మల్లారెడ్డి కోడలి ఆవేదన

Preeti Reddy : నా గదిలోకి చొరబడి బెదిరించారు.. మల్లారెడ్డి కోడలి ఆవేదన

Preeti Reddy  : నా గదిలోకి చొరబడి బెదిరించారు.. మల్లారెడ్డి కోడలి ఆవేదన
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడురోజులే గడువు ఉండడంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తిట్లు, విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు జోరుగా సాగుతున్నాయి. పార్టీల శ్రేణులు శ్రుతిమించి పరస్పరం భౌతిక దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పాతికమందికిపైగా కాంగ్రెస్ నేతలు తన గదిలోకి చొరబడి బండబూతులు తిట్టి, బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రీతి రెడ్డి తన మామకు మద్దతుగా పలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ మేడిపల్లి ఎస్వీఎం గ్రాండ్ ‌హోటల్‌లో బస చేస్తున్నారు. మల్లారెడ్డి మాదిరే పంచ్ డైలాగులు బిసురుతూ బోనం ఎత్తి, అదిరే డ్యాన్సులతో ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలను దుయ్యబడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు సోమవారం మధ్యాహ్నం తన గదిలోకి వచ్చి బెదిరించారని ప్రీతిరెడ్డి ఓ వీడియోలో చెప్పారు. ‘‘ఆడామగా కలిపి పాతికమందికిపైగా వచ్చారు. గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడి నన్ను భయపెట్టారు. ఇది సరికాదు. ఏదైనా ఉంటే ఎన్నికల్లో తేల్చుకోవాలి. రౌడియిజం, గుండాయిజం చేసే పార్టీకి ఓట్లు వేయొద్దని ప్రజలను కోరుతున్నాను. కాంగ్రెస్ ఓటమి ఖాయం. అది జీర్ణం కాకే బెదిరింపులకు పాల్పడుతున్నారు’’ అని ప్రీతి రెడ్డి అన్నారు.


Updated : 27 Nov 2023 8:25 PM IST
Tags:    
Next Story
Share it
Top