మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి : కవిత
X
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజల ఆశీస్సులతో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. కాంగ్రెస్ గ్రూప్ వివాదాలు, ఆ పార్టీ వైఫల్యాలే తమ పార్టీ విజయానికి కారణమవుతాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకోవడం కాంగ్రెస్ నైజమని విమర్శించారు.
సచివాలయ నిర్మాణంపై కాంగ్రెస్ వివాదాన్ని సృష్టించిందని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం విషయంలోనూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల ప్రయోజనం కోసమే విలీనమని వివరించారు. రుణమాఫీని కాంగ్రెస్ తమ విజయంగా చెప్పుకోవడం విడ్డూరమని కవిత అన్నారు.కేసీఆర్ ఎప్పుడైనా, ఏ పని అయినా చెప్పి చేస్తారని కొనియాడారు. రూ. 19 వేల కోట్ల నిధులతో 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి అర్థం లేని ఆరోపణలు అని కవిత ధ్వజమెత్తారు.