రేపు నూతన గవర్నర్ రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ
X
తెలంగాణ నూతన గవర్నర్‌గా రాధాకృష్ణన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు రాజ్ భవన్‌లో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించునున్నారు. దీంతో ఇవాళ రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిసై రాజీనామాతో రాష్ట్రపతి తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, తెలంగాణ గవర్నర్‌గా నియామకమైన రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. తెలంగాణకు నియమింపబడుతున్న గవర్నర్లంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు చివరి గవర్నర్ గా వ్యవహరించిన ఈ.ఎస్.ఎల్ నరసింహన్ తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా ఆయన కొనసాగారు. తెలంగాణతో పాటు ఏపీకి గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పని చేసిన ఈ.ఎస్.ఎల్. నరసింహన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా ఆయన తర్వాత తెలంగాణకు గవర్నర్ గా వచ్చిన తమిళిసై సౌందర రాజన్ సైతం తమిళనాడుకు చెందిన వ్యక్తే. ఇక తమిళిసై రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణకు రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. అయితే సీపీ రాధాకృష్ణ సైతం తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం హాట్ టాఫిక్.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.