Home > తెలంగాణ > ఎన్నికల ‘అక్రమ సొమ్ము’ రూ. 538 కోట్లు..

ఎన్నికల ‘అక్రమ సొమ్ము’ రూ. 538 కోట్లు..

ఎన్నికల ‘అక్రమ సొమ్ము’ రూ. 538 కోట్లు..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందే డబ్బు వరదలై పారుతోంది. ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో భారీ స్థాయిలో సొమ్ము పట్టుబడింది. రూ. 538 కోట్లకుపైగా విలువైన నగదు, బంగారం, ఇతర వస్తువలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ శుక్రవారం తెలిపారు. గత 24 గంటల్లోనే రూ. 5.77 కోట్ల సొమ్ము దొరికిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకు రూ. 184.89 కోట్లు నగదు, రూ. 178 కోట్ల విలువైన బంగారం, వెండి నగలు, రూ. రూ. 74.71 కోట్ల విలువైన మద్యం, రూ.31.64 కోట్ల విలువైన మత్తుపదార్థాలు దొరికాయని వికాస్ వెల్లడించారు. వీటితోపాటు రూ.68.36 లక్షలకుపైకు విలువైన మొబైల్ ఫోన్లు, చీరలు, ఇతర నిత్యావసరాలు దొరికాయని తెలిపారు.


Updated : 10 Nov 2023 10:53 PM IST
Tags:    
Next Story
Share it
Top