Home > తెలంగాణ > KCR: ఉడుత బెదిరింపులకు భయపడను.. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ సవాల్

KCR: ఉడుత బెదిరింపులకు భయపడను.. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ సవాల్

KCR: ఉడుత బెదిరింపులకు భయపడను.. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ సవాల్
X

కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా పదేళ్లలో ఏనాడు తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్ లో కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. అనంతరం తమ పదేళ్ల పాలనపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించారు. తాము అధికారంలో ఉండగా ప్రాజెక్టులు అప్పగించకపోతే మేమే నోటిఫై చేస్తామని ఆనాడు కేంద్రమంత్రి షేకావత్ బెదిరించారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో... నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా... తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోనని చెప్పానన్నారు. "ప్రాజెక్టులు అప్పగించే పరిస్థితి లేదని ఆనాడే చెప్పా. నన్ను పార్టీని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు. నీ కన్నా హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాది. కేసీఆర్ ఏనాడు వెనక్కి పోడు . ఉడుత బెదిరింపులకు భయపడను. ముందు ముందు ఏందో చూద్దాం... తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు" అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అధికార పార్టీ అగ్ర నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా స్పందించని కేసీఆర్.. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ముఖ్యమంత్రికి ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేదని అభిప్రాయపడ్డ గులాబీ బాస్... ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదన్నారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే తెలంగాణ అడుక్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. KRMB పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, చివరకు డ్యామ్‌కు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం చేయడం కొత్తమే కాదని.. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకూడదనే తమ పోరాటమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ సర్కారుకు తెలివి లేదని.. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలిపెట్టు లాంటిదన్నారు.ఇదే విషయం మీద.. నల్గొండ జిల్లాలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు

Updated : 6 Feb 2024 4:23 PM IST
Tags:    
Next Story
Share it
Top