Home > తెలంగాణ > తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం నిబంధనలు ఇవే..

తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం నిబంధనలు ఇవే..

తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం నిబంధనలు ఇవే..
X

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం శనివారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి రానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ‘మహాలక్ష్మి’ పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ మీడియాకు వెల్లడించారు. ఈ పథకంతో మహిళకు ఆర్థిక వెలుసుబాటు లభిస్తుందని అన్నారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రారంభిస్తారు. మహిళా మంత్రులు, సీఎస్‌, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మహాలక్ష్మి పథకం కోసం 7,200 బస్సులను వాడతారు. ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంతోపాటు మహిళలకు ప్రతినెలా రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆర్టీపై రోజుకు రూ. 4 కోట్ల భారం పడనుంది.

పథకం నిబంధనలు

తెలంగాణ స్థానికులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం జారీ చేసే స్థానిక గుర్తింపు కార్డు చూపాలి

పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం

ఏ వయసు మహిళలలకైనా ఉచితం, ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచితమే

తెలంగాణ పరిధిలోని ప్రాంతాలకు మాత్రమే ఈ పథకం పరిమితం

త్వరలో మహిళలందరికీ ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డుల పంపిణీ .

రాష్ట్ర సరిహద్దులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

మహిళలు బస్సు ఎక్కాక జీరో టికెట్ ప్రింటింగ్ అందజేస్తారు.

Updated : 8 Dec 2023 6:05 PM IST
Tags:    
Next Story
Share it
Top