Home > తెలంగాణ > Singareni Recruitment: సింగరేణి ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Singareni Recruitment: సింగరేణి ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Singareni Recruitment: సింగరేణి ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
X

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. 272 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి మార్చి 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ మార్చి 1 నుంచి అందుబాటులో ఉండనుంది.

ప్రకటన వివరాలు:

I. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు

1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్), ఈ2 గ్రేడ్: 139 పోస్టులు

2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఎ), ఈ2 గ్రేడ్: 22 పోస్టులు

3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్), ఈ2 గ్రేడ్: 22 పోస్టులు

4. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ), ఈ2 గ్రేడ్: 10 పోస్టులు

5. జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్: 10 పోస్టులు

6. మేనేజ్‌మెంట్ ట్రైనీ (హైడ్రో-జియాలజిస్ట్), ఈ2 గ్రేడ్: 02 పోస్టులు

7. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్), ఈ2 గ్రేడ్: 18 పోస్టులు

8. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్: 03 పోస్టులు

9. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఈ3 గ్రేడ్: 30 పోస్టులు

II. నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు

10. సబ్-ఓవర్సీర్ ట్రైనీ (సివిల్), టి & ఎస్‌ గ్రేడ్-సి: 16 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌), సీఏ/ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్‌, డిప్లొమా ఉత్తీర్ణత.

వయస్సు: గరిష్ఠంగా 30 ఏళ్లు మించకూడదు. జీడీఎంవో పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం: 01-03-2024.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 18-03-2024.

Updated : 2 March 2024 4:53 PM IST
Tags:    
Next Story
Share it
Top