Home > తెలంగాణ > తెలంగాణ ఓటర్ల జాబితా వచ్చేసింది.. మొత్తం ఎన్ని కోట్ల మంది అంటే..

తెలంగాణ ఓటర్ల జాబితా వచ్చేసింది.. మొత్తం ఎన్ని కోట్ల మంది అంటే..

తెలంగాణ ఓటర్ల జాబితా వచ్చేసింది.. మొత్తం ఎన్ని కోట్ల మంది అంటే..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు పుంజుకుంది. అటు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడగానే ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.06 కోట్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. రాష్ట్రంలో స్త్రీ, పురుష ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. రెండో ప్రత్యేక సవరణతో సోమవారం ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఓట్ల వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 19వరకు అభ్యంతరాలు, వినతులు సమర్పించవచ్చని తెలిపారు. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అక్టోబరు 4న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని, హైదరాబాద్ జిల్లాలో 3,986 పోలింగ్‌ కేంద్రాలు చేస్తామని వెల్లడించారు.





జాబితా ప్రకారం..

• రాష్ట్రంలో 3 కోట్ల 6 లక్షల 42 వేల 333 మంది ఉన్నారు.

• పురుష ఓటర్లు 1,53,73,66 మంది కాగా మహిళా ఓటర్లు 1, 52,51,797 మంది, ఇతరులు 2,133 మంది.

• 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

• సాధారణ ఓటర్లు 3,06,26,996 మంది , ప్రవాసులు 2,742 మంది, సర్వీసు ఓటర్లు 15,337 మంది.

• 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 4,76,597 మంది.

• ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,77,659. అందులోంచి 10,82,183 మంది పేర్లను తొలగించి, 8,31,520 మందిని చేర్చారు.

• హైదరాబాద్‌ జిల్లాలోని మొత్తం 40,30,989 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 22,09,972 మంది కాగా, మహిళలు 20,90,727 మంది, ఇతరులు 290. జూబ్లీహిల్స్‌ అత్యధికంగా 3,56,995 మంది, చార్మినార్‌లో అతి తక్కువగా 2,16,648 మంది ఉన్నారు.


Updated : 21 Aug 2023 10:44 PM IST
Tags:    
Next Story
Share it
Top