Home > తెలంగాణ > ఒక్క సీసా అమ్మకుండానే కోట్లు కొల్లగొట్టిన తెలంగాణ సర్కార్

ఒక్క సీసా అమ్మకుండానే కోట్లు కొల్లగొట్టిన తెలంగాణ సర్కార్

ఒక్క సీసా అమ్మకుండానే కోట్లు కొల్లగొట్టిన తెలంగాణ సర్కార్
X

తెలంగాణ సర్కార్కు ఫుల్ కిక్కు వచ్చింది. ఒక్క సీసా అమ్మకుండానే ఖజానాకు మస్త్ పైసల్ వచ్చాయి. లిక్కర్ టెండర్లతో అబ్కారీ శాఖకు భారీ ఆదాయం వచ్చింది. మద్యం దుకాణాలకు పెద్దఎత్తున టెండర్లు వచ్చాయి. ఎన్నికల ఏడాది కావడంతో ఆశావాహులు పోటీపడ్డారు. వైన్స్ లైసెన్స్‌ జారీ కోసం ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్సులకు నిర్వహించిన టెండర్లలో 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజే 56,980 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

ఈ టెండర్లతో రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలకు మించి రూ. 2,629.80 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా సరూర్‌నగర్‌లో 10,908, శంషాబాద్‌లో 10,811 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇక అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 967, ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 979 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 21న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇక 2021లో మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో 68,691 దరఖాస్తులు రాగా.. ఇప్పుడు దానికి డబుల్ వచ్చాయి.

ఈ నెల 4వ తేదీ నుంచి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ మొదలైన. డ్రాలో పాల్గొనే వ్యక్తులు రూ.2 లక్షల డీడీతో దరఖాస్తు సమర్పించారు. డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయిస్తారు. ఈ మూడు కేటగిరీలకు 756 వైన్సులను కేటాయించినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్‌ కేటగిరీలో ఉంచారు.



Updated : 20 Aug 2023 11:52 AM IST
Tags:    
Next Story
Share it
Top