Home > తెలంగాణ > Ponnam Prabhakar: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా

Ponnam Prabhakar: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా

Ponnam Prabhakar: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా
X

కేంద్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. కేంద్రంతోపాటు ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి(Venkateswaraswamy)ని దర్శించుకున్న మంత్రి.. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించడం పట్ల ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఆ రోజు అన్నదమ్ముల్లా తెలంగాణ, ఏపీ మధ్య రాష్ట్ర విభజన అనివార్యమైందని అన్నారు. విభజనతో పాటు అభివృద్ధి కావాలి కానీ అలా జరగలేదని విమర్శించారు. ఆనాడు ఏపీకి అవసరమైన హమీలను కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అందుకు సంబంధించి అప్పుడున్న నాయకులంతా ప్రతిపాదనకు ఒప్పుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఓట్లు వస్తాయా వైసీపీ, టీడీపీ ఓట్లు చీలుతాయా అని భవిష్యత్ చెబుతుందని అన్నారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురించి చెబుతూ .. తెలంగాణ వచ్చిన పదేళ్ళ తర్వాత ప్రజాపాలన ఏర్పడిందని అన్నారు. శ్రీవారిని అనేక సందర్భాలలో అనేక కోర్కెలు కోరుకున్నానని చెప్పారు. స్వామి వారి దయతో ఆ కోర్కెలు తీరాయని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేలా స్వామి చల్లని చూపు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో హుస్నాబాద్‌లో(Husnabad,) వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. హుస్నాబాద్ ప్రజల అభీష్టం మేరకు, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీని కోరినట్లు తెలిపారు. ఆలయానికి సరిపడా స్థలాన్ని కూడా సమకూరుస్తామని మంత్రి టీటీడీ చైర్మన్‌కు చెప్పారు. స్వామి వారి కృపా, కటాక్షాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు. ఈ సందర్భంగా టీటీడీ(TTD) చైర్మన్ మంత్రి పొన్నంను సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు.




Updated : 17 Jan 2024 7:02 AM IST
Tags:    
Next Story
Share it
Top