Home > తెలంగాణ > తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
X

అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసి రోజుల గడవక ముందే తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి మొదలుకానుంది. సర్పంచ్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కసరత్తు ప్రారంభించాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో 3 దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగగా.. ఫిబ్రవరి 1 నాటికి సర్పంచులు బాధ్యతలు చేప్టటారు. ఈ క్రమంలో వీరి పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనుంది.

నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 1లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ తంతు ముగిసేందుకు దాదాపు 3 నెలల సమయం పడుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇప్పటికే ఈ ప్రక్రియ ఆలస్యమైంది. తాజాగా శాసన సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల నియామకం, విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రారంభించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి గ్రామ కార్యదర్శులు ఇప్పటికే వివరాలు పంపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు పదేళ్లకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. ఈ నేపథ్యంలో కిందటిసారి రిజర్వేషన్లతోనే ఈసారి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

Updated : 6 Dec 2023 3:21 PM GMT
Tags:    
Next Story
Share it
Top