Home > తెలంగాణ > రాష్ట్రంలో కొత్తగా 2 JNTU ఇంజినీరింగ్‌ కాలేజీలు.. ఎక్కడో తెలుసా

రాష్ట్రంలో కొత్తగా 2 JNTU ఇంజినీరింగ్‌ కాలేజీలు.. ఎక్కడో తెలుసా

రాష్ట్రంలో కొత్తగా 2 JNTU ఇంజినీరింగ్‌ కాలేజీలు.. ఎక్కడో తెలుసా
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలను మంజూరుచేసింది. ఖమ్మం జిల్లా పాలేరు వద్ద రెండు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరమే(2022-23) నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చింది. గత జనవరిలో సీఎం కేసీఆర్‌ ఆయా జిల్లాల పర్యటనల సందర్భంగా ఇంజినీరింగ్‌ కళాశాలలను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మహబూబాబాద్‌ కళాశాలపై ఈ నెల 10వ తేదీన ఉత్వర్వులు జారీకాగా, పాలేరు కళాశాలకు సంబంధించి సోమవారం జీఓ జారీ చేశారు.

ఒక్కో కాలేజీలో అయిదు బ్రాంచీలు, ఒక్కో దాంట్లో 60 సీట్లకు అనుమతి ఇచ్చారు. CSE, CSE(డేటా సైన్స్‌), ECE, EEE, Mechanical బ్రాంచీలు మంజూరయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి మొదలయ్యే ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. బోధన, బోధనేతర పోస్టులు, బడ్జెట్‌ మంజూరుకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇస్తామని జీఓలో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన సిరిసిల్ల, గత ఏడాది మొదలైన వనపర్తి కళాశాలలకు ఇప్పటికీ పోస్టులు మంజూరు కాకపోవడం గమనార్హం. జేఎన్‌టీయూహెచ్‌కు హైదరాబాద్‌తోపాటు ఇప్పటివరకు మొత్తం 6 కాలేజీలు ఉండగా, తాజాగా మంజూరైన వాటితో ఆ సంఖ్య 8 కి చేరింది.

Updated : 15 Aug 2023 9:24 AM IST
Tags:    
Next Story
Share it
Top