Home > తెలంగాణ > మాజీ సీఎం కేసీఆర్‌‌కు భద్రత కుదింపు

మాజీ సీఎం కేసీఆర్‌‌కు భద్రత కుదింపు

మాజీ సీఎం కేసీఆర్‌‌కు భద్రత కుదింపు
X

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు భద్రత కుదిస్తున్నట్టు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్‌కు వై కేటగిరి భద్రత కల్పించారు. థ్రెట్‌ పర్సప్షన్‌ రేట్‌(టీపీఆర్‌)కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ నుంచి గన్‌మెన్‌లను రీకాల్‌ చేశారు. దీంతో 4+4 గన్‌మెన్లతో పాటు ఎస్కార్ట్ వాహనం కూడా కేసీఆర్‌ వెంట ఉండనుంది. అలాగే కేసీఆర్ ఇంటి ముందు సెంట్రీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ప్రజాప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్‌శాఖ సమీక్ష నిర్వహించి.. మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ప్రాణహాని, ఇతరుల నుంచి ముప్పుగానీ లేదని అంచనాకు వచ్చి వారి భద్రత తొలగించింది.

ఇదిలా ఉంటే.. కేసీఆర్‌కు ఒక్కసారిగా భద్రత కుదించడంపై బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి ఇలా ఒకేసారి భద్రత కుదించడం మంచిది కాదని అంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. అనంతరం నందినగర్‌లోని ఇంటికి వెళ్తారు. అనంతరం ఆయన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన మంత్రులకు 2+2 భద్రత ప్రొవైడ్ చేశారు. ఓడిపోయిన నేతల భద్రతను పూర్తిగా తొలగించారు. అన్ని పార్టీలకు ఇది వర్తిస్తుందని పోలీసులు శాఖ తెలిపింది.

Updated : 15 Dec 2023 10:49 AM IST
Tags:    
Next Story
Share it
Top