Home > తెలంగాణ > తెలంగాణలో ఒకే రోజు 9మెడికల్ కాలేజీలు ప్రారంభం : KTR

తెలంగాణలో ఒకే రోజు 9మెడికల్ కాలేజీలు ప్రారంభం : KTR

తెలంగాణలో ఒకే రోజు 9మెడికల్ కాలేజీలు ప్రారంభం : KTR
X

తెలంగాణలోని ప్రతి జిల్లాకు ప్రభుత్వం ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలు కాలేజీలు ప్రారంభమవ్వగా.. మరికొన్ని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 15న మరో 9 కాలేజీలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో మంత్రలు కేటీఆర్, హరీష్ రావులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాలో మెడికల్ కాలేజీలు ప్రారంభంకానున్నాయి. మెడిక‌ల్ కాలేజీల ప్రారంభోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని కేటీఆర్ సూచించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో 15 నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వ‌హించాల‌న్నారు. మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్‌ స్వయంగా ఓ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని కేటీఆర్ చెప్పారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని చెప్పారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణ‌కు ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేద‌న్నారు. ఇక 50 ఏళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ‌కు కేవ‌లం రెండు మెడిక‌ల్ కాలేజీలు మాత్ర‌మే ద‌క్కాయ‌న్నారు. జాతీయ పార్టీల మోసాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పార్టీ శ్రేణులకు సూచించారు.

రెండు జాతీయ‌ మోసం చేసినా.. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో దేశంలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. 15న ఒకేసారి 9 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభించి చరిత్ర సృష్టించనుందని చెప్పారు. తెలంగాణ ఆహార ఉత్పత్తిలోనే కాదు.. దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్లను తయారుచేసే కార్ఖానాగా ఎదిగిందని హరీష్ రావు అన్నారు. దేశంలో అత్య‌ధిక ఎంబీబీఎస్ సీట్లు గ‌ల రాష్ట్రం.. తెలంగాణ మాత్ర‌మే అని మంత్రిస్ప‌ష్టం చేశారు.


Updated : 8 Sept 2023 9:18 PM IST
Tags:    
Next Story
Share it
Top