బీజేపీ, కాంగ్రెస్‌లకు చురకలంటిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్
X
అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు కేటీఆర్‌ను కలిసి.. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర రాజకీయాలపైనా ఓ కన్నేసి ఉంచిన కేటీఆర్.. తాజాగా మరోసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు.బీజేపీ రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత, ఇతర సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఉందంటూ ట్వీట్ చేశారు.
In the below list the Majority of Energy deficit states are
— KTR (@KTRBRS) September 4, 2023
1. Double Engine Sates (BJP governed)
2. Rest are Congress governed states or those of its Coalition partners
Telangana which was projected as a power deficit state in 2013-14 is now not only a power surplus state… pic.twitter.com/ilvfAAkiYr
2013-14 లో విద్యుత్ లోటుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉందని అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని వెల్లడించారు. అందుకే తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికే ఉత్తమ నమూనా అంటూ ట్వీట్ చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ విధానాలను.. పథకాలను ఫాలో అవుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.