Home > తెలంగాణ > ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వీసీ

ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వీసీ

ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వీసీ
X

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా ఏసీబీకి చిక్కారు. శనివారం ఉదయం ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ.. అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ లోని తన ఇంట్లో రూ.50వేలు లంచం తీసుకుంటూ రవీందర్ పట్టుబడ్డారు. గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే.. యూనివర్సిటీలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఇవాళ (జూన్ 17) భీమ్ గల్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు శంకర్ అనే వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు రవీందర్. వీసీ లంచం అడగడంతో శంకర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో అధికారులు వలపన్ని.. శనివారం ఉదయం రవీందర్ ఇంట్లో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లో తనికీలు నిర్వహించి.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత రవీందర్ ను అదుపులోకి తీసుకుని.. వర్సిటీలోనూ తనిఖీలు చేపట్టారు. వర్సిటీలో నియామకాలు, నిధులపై ఆరా తీస్తున్నారు.

Updated : 17 Jun 2023 9:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top