ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా
X
తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం పార్లమెంటుకు చేరుకున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని స్పీకర్ ఓమ్ బిర్లాకు తెలిపి రాజీనామా లేఖను అందజేశారు. పార్లమెంటులో పలువురు ఎంపీలు రేవంత్‌ను అభినందించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కొడంగల్ నుంచి గెలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన మల్కాజిగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులను ఆహ్వానించిన రేవంత్ హైదరాబాద్ చేరుకోవడానికి విమానాశ్రయానికి వెళ్లారు. అయితే చివరి క్షణంలో అధిష్టానం ఆయనను వెనక్కి పిలిపించుకుని మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్న తెలుస్తోంది. రేవంత్ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరవుతారని అంచనా.