Home > తెలంగాణ > విజయ్ కాంత్ మరణంపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

విజయ్ కాంత్ మరణంపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

విజయ్ కాంత్ మరణంపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
X

తమిళ నటుడు విజయ్ కాంత్ మరణం పై తెలుగు సినిమా పరిశ్రమ సంతాపాన్ని తెలియజేసింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు, గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా విజయ్ కాంత్ సినీ, జీవిత విశేషాలను గురించి ఆ ప్రకటనలో గుర్తు చేసుకున్నారు. విజయ్ కాంత్ 1952 ఆగస్ట్ 25న జన్మించారని.. 1979లో ‘ఇనిక్కుమ్ ఇలామై’ సినిమా ద్వారా విలన్ గా చిత్ర రంగ ప్రవేశం చేశారని.. ఆ తర్వాత 40యేళ్ల పాటు నటనా రంగంలో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. అలాగే పోలీస్ అధికారిగా 20కి పైగా సినిమాల్లో నటించడాన్ని, తమిళ్ సినిమా పరిశ్రమలో ఎక్కువసార్లు పోలీస్ పాత్రల్లో నటించిన నటుడు అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన నటించిన తమిళ సినిమాలు తెలుగులోనూ విజయం సాధించడం గురించి పేర్కొన్నారు. 150కి పైగా సినిమాల్లో నటించారనీ.. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలైన సందర్భాన్ని ప్రస్తావించారు.

2005లో డిఎండికే పార్టీని స్థాపించి, 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారన్నారు. దక్షిణభారత కళాకారుల అసోసియేషన్ కు అధ్యక్షుడుగా పనిచేసిన విషయాన్ని, 2001లో కళై మామణి పురస్కారం పొందిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

మొత్తంగా విజయ్ కాంత్ మృతి పట్ల తెలుగు సినిమా పరిశ్రమ తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Updated : 28 Dec 2023 6:00 PM IST
Tags:    
Next Story
Share it
Top