Kukatpally BJP Ticket: జనసేనకు టికెట్ ఇస్తే ఊరుకోం.. బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
X
హైదరాబాద్ లోని కూకట్ పల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కూకట్ పల్లి బీజేపీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. కూకట్ పల్లి సీటును జనసేనకు కేటాయించొద్దని డిమాండ్ చేస్తున్నారు. జనసేనతో పొత్తు వద్దు బాబోయ్ అని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని రాష్ట్ర నేతలపై, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఏ ప్రాతిపాదికన సీట్లు కేటాయిస్తారంటూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గత మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా బీజేపీ ఆఫీస్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో బీజేపీ నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా సీట్లు ఖరారు కాలేదని, ఎవరూ ఆవేశపడొద్దని చెబుతున్నారు. అయినా కార్యకర్తలు మాత్రం ఆ సీటును బీజేపీకి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. జనసేనకు ఇస్తే తాము ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు.
కాగా తెలంగాణలో బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. కానీ అధికారికంగా మాత్రం పొత్తు ఖరారు కాలేదు. అయితే కొన్ని స్థానాల్లో మాత్రం సీట్ల లొల్లి ప్రారంభమైంది. కూకట్ పల్లి సీటును జనసేకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానిక బీజేపీ కార్యర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూకట్ పల్లిలో బీజేపీ ఉందంటే తమ వల్లేనని అంటున్నారు. అవసరమైతే బీజేపీకి గుడ్ బై చెప్పి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు.