Home > తెలంగాణ > Mallareddy University : మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

Mallareddy University : మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

Mallareddy University  : మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..
X

(Mallareddy University) మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సటీని విద్యార్థులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ముట్టడించారు. రెండు రోజుల క్రితం లేడీస్ హాస్టల్‌లోని భోజనంలో పురుగులు వచ్చిన సంగతి తెలిసిందే. నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్న యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ గేటు ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. కాలేజ్ ముందు విద్యార్థులు భారీగా చేరుకోవడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా పట్టించుకోకుండా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లేడీస్ హాస్టల్ లో మగవాళ్లను సెక్యూరిటీ గార్డులుగా పెట్టీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.లక్షలాది రూపాయలు వసూలుచేస్తున్న మల్లారెడ్డి వర్శిటీ యాజమాన్యం నాణ్యమైన విద్య,భోజనం క్వాలిటీ మీల్స్ అందించకుండా విద్యార్థులు వేధిస్తున్నారని ఆరోపించారు. భోజనం సరిగ్గా లేక స్టూడెంట్స్ అస్వస్థతకు గురైన విషయం బయటకు తెలియకుండా దాస్తుందని మండిపడ్డారు. యూనివర్సటీ గర్ల్స్ హాస్టల్‌లో ఫిబ్రవరి 7న రాత్రి భోజనంలో బొద్దింక, బల్లి పడి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని దీంతో ఆందోళనకు దిగారు. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకులకు తెలియడంతో గురువారం అక్కడి నిరసన తెలిపారు. దీంతో వర్శిటీ సిబ్బంది వారిపై దాడి చేశారు. ఆ రోజు నుంచి వర్సిటీ ముందు స్టూడెంట్స్ ఆందోళనలు కొనసాగుతున్నాయి.




Updated : 10 Feb 2024 1:33 PM IST
Tags:    
Next Story
Share it
Top