ప్రభుత్వ నిర్ణయంతో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి..Harish Rao
X
అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆటో వాలాలకు మద్దతూ తెలుపుతూ...బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గన్ పార్క్ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. రెండు నెలల్లో 21 మంది డ్రైవర్లు ఆత్మహాత్య చేసుకున్నారన్నారు. ఉచిత బస్సు మంచిదే కానీ ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆటోలపై 6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.
ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలపడమే మా ఉద్దేశమని తెలిపారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బడ్జెట్ లో ఆటో కార్మికుల కోసం నెలకు 10 వేలు జీవన భృతి కల్పించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. అయితే ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీలోకి ప్లకార్డులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదంటూ గేటు బయట వారిని ఆపేశారు.