Home > తెలంగాణ > వాహనదారులకు అలర్ట్..నెంబర్ ప్లేట్‌లపై టీజీ త్వరలో కేంద్రం నోటిఫికేషన్

వాహనదారులకు అలర్ట్..నెంబర్ ప్లేట్‌లపై టీజీ త్వరలో కేంద్రం నోటిఫికేషన్

వాహనదారులకు అలర్ట్..నెంబర్ ప్లేట్‌లపై టీజీ త్వరలో కేంద్రం నోటిఫికేషన్
X

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ఇక నుంచి టీజీగా మార్చేందుకు కేంద్ర సర్కార్ త్వరల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. రిజిస్ట్రేషన్ కోడ్‌లో మునుపటి టీఎస్‌కు బదులు టీజీ చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ నెల 5న లేఖ రాసింది. రవాణాశాఖ సంయుక్త కమిషనర్ పాండురంగనాయక్ ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులను కూడా కలిశారు. అయితే, ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్ర నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్ర ఉత్తర్వులు వచ్చిన వెంటనే రాష్ట్ర రవాణాశాఖ కూడా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కోడ్‌తో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. అయితే, ఈ మార్పును ప్రభుత్వం కొత్త వాహనాలకే పరిమితం చేసింది. పాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. గత రిజిస్ట్రేషన్ కోడ్ అయిన టీఎస్‌ను కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించింది.

టీఎస్ ను టీజీగా మార్పడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణాలు వివరించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో తెలంగాణకు టీజీగానే ఆమోదం తెలిపిందన్నారు. కానీ అయితే మాజీ సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ను కాదని టీఎస్‌గా పేరు మార్చారన్నారు. తెలంగాణను టీజీ గానే ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వాహన రిజిస్ట్రేషన్లతో పాటు ఇకపై ఏదైనా టీజీ గానే ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా నిరసనలలో రాష్ట్రం పేరును టీజీ గానే వ్యవహరించేవారు. నిరసనల్లో భాగంగా ప్రభుత్వ ఆఫీసుల బోర్డులను ఏపీకి బదులుగా టీజీగా అని మార్చేవారు. కానీ అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ కు జై కొట్టింది. దీనిపై అప్పట్లోనే వ్యతిరేకత వ్యక్తం అయింది.

Updated : 24 Feb 2024 1:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top