ప్రీతి కేసు.. సైఫ్ సస్పెన్షన్ పొడగింపు
X
తెలంగాణలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు సైఫ్పై వచ్చిన ఆరోపణలు వాస్తవేమనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలపడంతో అతడిపై సస్పెన్షన్ పొడగించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో మరో 97 రోజుల పాటు సైఫ్కు సస్పెన్షన్ పొడగించారు. గతేడాది 22న ప్రీతి ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. నిమ్స్లో చికిత్స పొందుతూ 26న మరణించింది.
ప్రీతి మృతికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ఆమె పేరెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే అతడు ఏప్రిల్లో బెయిల్పై విడుదలయారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కాకతీయ యాంటీ ర్యాగింగ్ కమిటీ సైఫ్ను కాలేజీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేసింది. కమిటీ నిర్ణయాన్నిసైఫ్ హైకోర్టులో సవాల్ చేసిన సైఫ్.. ర్యాగింగ్ కమిటీ తన వాదన వినకుండా సస్పెండ్ చేసిందని.. వెంటనే ఎత్తివేయాలని కోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో అతడి సస్పెన్షన్ను తాత్కలికంగా ఎత్తేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో అతడి వాదనలు వినాలని కమిటీకి సూచించింది. దీంతో నవంబరు 9న ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశమవ్వగా.. సైఫ్ హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు.. ప్రీతి కేసులో సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తమేనని తేల్చింది. ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా.. కమిటీ విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.