Home > తెలంగాణ > PM MODI : తెలంగాణ అభివద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది..ప్రధాని మోదీ

PM MODI : తెలంగాణ అభివద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది..ప్రధాని మోదీ

PM MODI : తెలంగాణ అభివద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది..ప్రధాని మోదీ
X

సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంగారెడ్డి, నాందేండ్, అఖోలా జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. అనంతరం నేషనల్ హైవే 65 విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రెండో రోజు తెలంగాణ ప్రజలతో ఉండడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. సంగారెడ్డి నుంచి 7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా 56 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.

తెలంగాణ అభివద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు ఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య పెరిగిందని తేల్చారు. దేశంలోనే తొలి ఎవియేషన్ సెంటర్ ను బేగంపేట్ లో ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ దక్షిణ భారతానికి గేట్ వే అని కొనియాడారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు.




Updated : 5 March 2024 6:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top