తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్.. ఈసీ అభ్యంతరం
X
తెలంగాణ భవన్‌లో చేపట్టిన దీక్షా దివస్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని అధికారులు సూచించారు. అయితే దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. తెలంగాణ భవన్ బయట, ఆవరణలో కార్యక్రమాలు చేయొద్దని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు కోరగా.. ఎన్నికల అధికారులు అంగీకరించారు. ఇక దీక్షా దివస్‌లో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలంగాణ భవన్‌లో రక్త దాన శిబిరాన్ని( Blood donation) ప్రారంభించారు. అనంతరం స్వయంగా రక్త దానం చేశారు. కేటీఆర్‌తో పాటు దీక్షా దివస్‌కు హాజరైన బీఆర్‌ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు.
అంతకుముందు దీక్షా దివస్ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణ భవన్‌లో దీక్షా దివాస్ కార్యక్రమం చేయొద్దని ఎలక్షన్ స్క్వార్డ్ టీమ్ గులాబీ పార్టీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ ఇదే అంశంపై ఎలక్షన్ స్క్వాడ్ టీమ్‌తో సంప్రదింపులు జరిపింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సోమభరత్ సీపీతో మాట్లాడిన తర్వాత కూడా పర్మిషన్ రాలేదు. దీక్షాదివస్ కార్యక్రమాలు చేయొద్దని సీపీ స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సైతం పూల మాల వేయవద్దని సీపీ తేల్చి చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన మంత్రి కేటీఆర్ ఈ విషయంపై కలగజేసుకోవడంతో.. రక్తదాన శిబిరానికి మాత్రమే ఎన్నికల అధికారులు అంగీకరించారు