Home > తెలంగాణ > కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం.. తెలంగాణ గవర్నర్ మార్పు?

కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం.. తెలంగాణ గవర్నర్ మార్పు?

కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం.. తెలంగాణ గవర్నర్ మార్పు?
X

తెలంగాణ గవర్నర్ మార్పుకు రంగం సిద్ధమైందా? డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ స్థానంలో కొత్త గవర్నర్ ను నియమిస్తున్నారా? అంటే.. అవును అనే సమాధానం వినిపిస్తుంది. తమిళిసైకి బదులుగా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ ను నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉండగా.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. మంగళవారం (డిసెంబన్ 26) ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అవుతారు. ఆ సమావేశంలో తెలంగాణ గవర్నర్ మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు వ్యవహరిస్తున్నారు తమిళిసై. ఇకపై ఫుల్ టైం పుదుచ్చేరి బాధ్యతలకే పరిమితం కానున్నట్లు సమాచారం. లోక్ సభ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె స్థానంలో మరొకరిని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా 2019 సెప్టెంబర్ 1న తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై.. ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఆమె ఐదేండ్ల పదవీకాలం పూర్తి కానుంది. కాగా దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.


Updated : 25 Dec 2023 4:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top