Home > తెలంగాణ > అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరు చేసిన సీఎం

అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరు చేసిన సీఎం

అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరు చేసిన సీఎం
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం రూ1,190 కోట్లు మంజూరు చేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆమోదంతో డెవలప్మెంట్ పనులు చేపట్టాలని సర్కారు జీవో జారీ చేసింది. విద్యాసంస్థలకు 2 కోట్ల, మంచినీటికి కోటి ఖర్చు చేయాలని జోవోలో పెర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులకు అప్పగిస్తున్నట్టు రేవంత్‌ ప్రకటించారు. సంక్షేమం..అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని, తాను గత సీఎం తరహా కాదని తేల్చి చెప్పారు.

వారానికి మూడురోజులు సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు సచివాలయంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. రేపు తొలిసభ ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసభ ఇంద్రవెళ్లిలో నిర్వహించగా, సీఎం హోదాలోనూ అక్కడ జరిగే తొలిసభలో రేవంత్‌ పాల్గొంటారు. ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మతివనానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలా­బా­ద్‌ నేతలకు రేవంత్‌ సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు కృషి చేయాలని, రెట్టి ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ నేతలకు రేవంత్‌ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు.

Updated : 1 Feb 2024 4:06 PM GMT
Tags:    
Next Story
Share it
Top