Hanumakonda : విద్యార్థినిపై కాలేజీ ఛైర్మన్ లైంగిక వేధింపులు
X
తన కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై ఛైర్మన్ లైంగిక దాడికి యత్నించాడు. అర్ధరాత్రి హాస్టల్కు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థిని భయపడి కేకలు వేయడంతో మిగితా స్టూడెంట్స్ నిద్రలేచారు. దీంతో ఆ కీచక వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లా బీమారంలో జరిగింది. భీమారంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కాలేజ్ హాస్టల్లో మిగతా స్టూడెంట్లతో కలిసి ఉంటోంది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన రూంలో నిద్రిస్తుండగా కాలేజ్ ఛైర్మన్ బూర సురేందర్ గౌడ్ వెళ్లాడు. విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయగా.. మిగతా విద్యార్థినులు ఆ గదికి వచ్చారు. అయితే సురేందర్ గౌడ్ వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిందితుడు పరారీలో ఉన్నాడని.. త్వరలోనే త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.