Home > తెలంగాణ > Dharani : ధరణి పోర్టల్‌లో మార్పులకు కమిటీ నిర్ణయం

Dharani : ధరణి పోర్టల్‌లో మార్పులకు కమిటీ నిర్ణయం

Dharani : ధరణి పోర్టల్‌లో మార్పులకు కమిటీ నిర్ణయం
X

తెలంగాణ రాష్ట్రంలో భూసమస్యలను ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని, చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని కమీటి అభిప్రాయపడింది. ధ‌ర‌ణి చ‌ట్టం చేయ‌డంలోనే లోపాలున్నాయ‌న్నారు. ఈ చ‌ట్టంలో క‌లెక్ట‌ర్ల‌కు అధికారం అంశంపై ఎక్క‌డా ప్ర‌స్తావ‌న లేద‌ని చెప్పారు. రైతుల‌కు భూముల హ‌క్క‌లు విష‌యంలో గ‌తంలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌త్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. 2014కు ముందు రెవెన్యూలో చిన్న చిన్న స‌మ‌స్య‌లు రావ‌చ్చు కానీ హ‌క్కుల విష‌యంలో రాలేద‌ని చెప్పారు. ధ‌ర‌ణిలో హ‌క్కులు హ‌రించి పోయాయ‌ని ఆరోపించారు. గ‌త ప్ర‌భుత్వం రైతుల‌ను చాలా ఇబ్బంది పెట్టింద‌న్న కోదండరెడ్డి.. చిన్న రైతుల‌కు చాలామందికి రైతు బంధురాలేదు కానీ, వంద‌ల ఎక‌రాలున్న‌వారికి మాత్రం వ‌చ్చింద‌ని ఆరోపించారు. ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల కార‌ణంగా చిన్న రైతుల‌కు రుణాలు రాలేద‌న్నారు.

ఒక ప‌టిష్ట‌మైన చ‌ట్టం తీసుకు వ‌స్తామ‌ని తెలిపారు. ఈ ఆరేళ్ల‌లో ల‌క్ష‌ల మంది రైతులు హ‌క్కులు లేక, ఆర్థిక స‌హాయం అంద‌క ఇబ్బంది ప‌డుతున్నారని అన్నారు. ఈ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని వ్యాఖ్యానించింది. సిద్దిపేట, వరంగల్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన కమిటీ సభ్యులు, ధరణి పోర్టల్‌ సవరణ మార్గదర్శకాలు, చట్టబద్దత లేకపోవడంపై ప్రశ్నలు అడిగారు. కమిటీ సూచన మేరకు ఏడు అంశాలపై కలెక్టర్లు వివరాలను అందించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ సంస్థ టెర్రాసిస్‌ ప్రతినిధులతోనూ సుదీర్ఘంగా కమిటీ చర్చించింది. ధరణి సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి మాడ్యుల్స్‌ ఎలా పనిచేస్తున్నాయి? దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఏ ఏ దశల్లో సాఫ్ట్‌వేర్‌ ఎలా పని చేస్తుంది? ఎదురవుతున్న సమస్యలపై లోతుగా ఆరా తీశారు. సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని మాడ్యుల్స్‌ అవసరమని, దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అంతా ఆన్‌లైన్‌లోనే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

Updated : 25 Jan 2024 7:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top