Transfer of IPS : ఐపీఎస్‌ల బదిలీలను ప్రారంభించిన రేవంత్ సర్కార్
Veerendra Prasad | 12 Dec 2023 1:11 PM IST
X
X
తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే..హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిను నియామకం చేసింది. ఇక సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి ని, రాచకొండ సీపీగా సుధీర్ బాబు ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్ గా సందీప్ శాందీల్య నియామకం అయ్యారు. చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీకి అటాచ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా మార్పులకు శ్రీకారం చుడుతుందని భావించారు. ఊహించినట్లుగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ ల బదిలీలకు శ్రీకారం చుట్టారు.
Updated : 12 Dec 2023 1:11 PM IST
Tags: Congress government transfer of IPS Telangana state Kothakota Srinivas Reddy Hyderabad Police Commissioner Telangana government Avinash Mahanthi as Cyberabad CP Sudhir Babu as Rachakonda CP Sandeep Sandilya as Telangana Narcotics Bureau Director
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire