Home > తెలంగాణ > అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో భారత నగరాలకు దక్కని చోటు

అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో భారత నగరాలకు దక్కని చోటు

అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో భారత నగరాలకు దక్కని చోటు
X

లైఫ్ లో ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతగా బతకాలి అనుకుంటారు చాలామంది. అలా అనుకునేవాళ్ల కోసం ‘ది ఎకనామిస్ట్’ వాళ్లు ప్రపంచంలోని ప్రశాంతమైన నగరాల లిస్ట్ ను విడుదల చేశారు. చాలామంది ఈ నగరాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నారట. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాలుగా ఆస్ట్రియా రాజధాని వియెన్నా మొదటి స్థానంలో.. డెన్మార్క్ లోని కోపెన్ హాగెన్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీలు ఉన్నాయి. ఈ జాబితాలో మొత్తం 173 దేశాల పేర్లు ఉండగా.. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఏ నగరానికి టాప్ 10లో చోటు దక్కలేదు.

హెల్త్ కేర్, స్టడీ, మౌలిక సదుపాయాలు, పర్యావరణం తదితర ఎన్నో అంశాలను పరిగణంలోకి తీసుకుని ఈ సర్వే చేపట్టారు. ఈ జాబితాలో కెడనాకు చెందిన 3 నగరాలు కల్గరీ, వాంకోవర్, టొరంటోలకు టాప్ 10లో చోటు దక్కింది. స్విట్జర్లాండ్ కు చెందిన 2 నగరాలు జూరిచ్, జెనీవా కూడా స్థానం దక్కించుకున్నాయి. భారత్ లోని ఢిల్లీ, ముంబైలు 141వ స్థానంలో, చెన్నై 144వ స్థానంలో, అహ్మదాబాద్ 147, బెంగళూరు 148 స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు చోటు దక్కలేదు.

Updated : 22 Jun 2023 1:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top